
- 14 చోట్ల గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రైవేట్ డాక్టర్
- రూ. 50 వేల దాకా బిల్లు వసూలు.. ఉల్టా కేసు
- వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆలస్యంగా తెలిసిన ఘటన
వనపర్తి, వెలుగు : అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. ఇంజెక్షన్ చేయగా వికటించి సీరియస్ అయిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోటకు చెందిన విద్యాసాగర్అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజుల కింద స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా నర్సు ఇంజెక్షన్చేసింది. అనంతరం అతని బాడీ గడ్డకట్టింది. వారం రోజుల తర్వాత వెళ్లి టెస్టులు చేయించుకోగా కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్చెప్పారు. వెంటనే పెబ్బేరులోని తన ఆస్పత్రిలో పేషెంట్ ను డాక్టర్ అడ్మిట్ చేయించి అతని ఎడమ తొడకు14చోట్ల గాట్లు పెట్టి ఆపరేషన్చేసి కుట్లు వేశాడు.
ఇందుకు బాధితుడి వద్ద ముందుగా రూ.29వేలు ఫీజు వసూలు చేశాడు. నాలుగు రోజులకు డిశ్చార్జ్ సమయంలో మరో రూ.4 లక్షలు కట్టాలని డాక్టర్డిమాండ్ చేస్తే రూ. 50 వేలు ఇస్తామని పేషెంట్బంధువులు బతిమిలాడి రూ.20వేలు చెల్లించారు. మిగతా రూ.30వేలు తర్వాత ఇస్తామని చెప్పడంతో హామీ పత్రం రాయించుకుని డాక్టర్ డిశ్చార్జ్ చేశారు. బాధితులు ఊరికి వెళ్లి చెప్పుకోగా.. డాక్టర్ వద్దకు రాజీకోసం పెద్దమనుషులను పంపించగా కొత్తకోటస్టేషన్లో తమపైనే ఎఫ్ఐఆర్నమోదైందని తెలిసి కంగుతిన్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొత్తకోట సీఐ రాంబాబును వివరణ కోరేందుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.