మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు గ్యాప్ ఇచ్చి మరీ ముంబైకి ప్రియాంక చోప్రా

మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు గ్యాప్ ఇచ్చి మరీ ముంబైకి ప్రియాంక చోప్రా

వరుస గ్లోబల్ ప్రాజెక్ట్స్‌‌‌‌తో హాలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌గా పాపులారిటీ అందుకుంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ లేకుండానే ఎన్నో అంచనాల మధ్య హైదరాబాద్‌‌‌‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రియాంక చోప్రా షూట్ గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం ముంబైకి వెళ్లింది. దీంతో ఆమె లేకుండానే మిగతా పోర్షన్‌‌‌‌ను 

షూట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేశారట. మహేష్ బాబుతో కూడిన కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నారు.  దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కేఎల్‌‌‌‌ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.