- ప్రొఫెసర్ హర గోపాల్
కల్వకుర్తి, వెలుగు: ప్రజలకు శాంతియుతంగా ఉద్యమాలు చేసుకునే హక్కు ఉన్నదని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నల్లమలలో బల్మూరు మండలం మైలారం గ్రామానికి చెందిన మైనింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న అక్కడి ప్రజలకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా.. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లమలలో ఖనిజ వనరుల కోసం మైలారం గుట్టలను తవ్వడం వలన అక్కడి ప్రకృతికి, ప్రజలకు చేటు కలుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలతో మాట్లాడి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు సహకరించి మైలారం మైనింగ్ పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.