కాంగ్రెస్ లో చేరిన అధికార పార్టీ సర్పంచులు : పి సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలంలో అధికార పార్టీ నుంచి కాంగ్రెస్​లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మండలంలోని ఎంఎస్ సీ ఫారం గ్రామ సర్పంచ్ విజయకుమార్, నెహ్రూ నగర్ సర్పంచ్ అమానుల్లా షరీఫ్ అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. బోధన్ మండలం పెగడపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయ్ కుమార్ గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరగా, అమానుల్లా షరీఫ్ తెలుగుదేశం నుంచి బీఆర్​ఎస్ లో చేరారు. సర్పంచ్ విజయ్ కుమార్ తో పాటు 30 మంది యువకులు, అమానుల్లాతో పాటు 20 మంది యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఈరంట లింగం, లీడర్లు శరత్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, నోముల శ్రీనివాస్ పాల్గొన్నారు.