వేసవిలో ఎలక్ట్రానిక్స్ జరభద్రం!

వేసవిలో ఎలక్ట్రానిక్స్ జరభద్రం!

వేసవిలో ఫోన్​లు, కంప్యూటర్లు, ల్యాప్​ట్యాప్​ వండి ఎలక్ట్రానిక్ డివైజ్​లు వాడితే అవి త్వరగా వేడెక్కే ప్రమాదం ఉంది. కొన్నిసందర్భాల్లో అవి పేలిన ఘటనలు కూడా చూశాం. కాబట్టి సమ్మర్​లో బయట టెంపరేచర్స్​కి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అర్థమవుతుంది. అందుకోసం ఏం చేయాలంటే... ఎలక్ట్రానిక్స్ డివైజ్ ఏదైనా ఉయోగించిన తర్వాత వెంటిలేషన్​ ఉన్న చోట పెట్టాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. తద్వారా వేడిని బయటకు తీసుకురాగలవు. 

ల్యాప్​ట్యాప్​ లేదా కంప్యూటర్​ పనిచేసేటప్పుడు వేడెక్కకుండా ఉండేందుకు దానిపై సన్​లైట్ పడకుండా జాగ్రత్త పడాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. అలా ఉంచితే త్వరగా వేడెక్కుతాయి. వేడెక్కిందని తెలిస్తే వెంటనే పక్కన పెట్టాలి. కాసేపటి వరకు దాన్ని వాడకూడదు. అలాగే గోడకు ఆనించి పెట్టకూడదు. ఎలక్ట్రానిక్ డివైజ్​లు ఏవైనా వేడెక్కకుండా అవసరమైతే కూలింగ్ ప్యాడ్​ వాడాలి. 

►ALSO READ | ఓషియనెవో నుంచి స్క్రాచ్ రెసిస్టెంట్​ కాస్మొటిక్స్​​ బాక్స్​