రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి : ప్రకాశ్​ రెడ్డి

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి : ప్రకాశ్​ రెడ్డి
  • పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్​ రెడ్డి

పర్వతగిరి(సంగెం), వెలుగు :రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.  వరంగల్​ జిల్లా సంగెం మండలం కాట్రపెల్లిలో గురువారం రాత్రి నిర్వహించిన  జై బాపు, జై భీమ్,  జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మండల కోఆర్డీనేటర్​మాసాని యాకూబ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానించిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.