న్యూ బస్టాండ్ ఎదుట హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన

 న్యూ బస్టాండ్ ఎదుట హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఆర్టీసీ న్యూ బస్టాండ్ ఎదుట గురువారం 150 మంది హైర్ బస్ డ్రైవర్ల రిక్రూట్ మెంట్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ఎంప్లాయీమెంట్ శాఖ ద్వారా సీనియార్టీ ప్రకారం డ్రైవర్ల కొరతను తీర్చేందుకు  అర్హులైన 150 మందికి గురువారం ఖమ్మం న్యూ బస్టాండ్ ఆవరణలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్ట్ లో హెవీ లైసెన్స్ తో పాటుగా డ్రైవర్ల ఎత్తు, బరువు, రీడింగ్, రైటింగ్ పరీక్షలు నిర్వహించారు. 

మధ్యాహ్నం తర్వాత ఆర్టీసీ యాజమాన్యం 150 మందిలో బయట నుంచి ఎంపికైన డ్రైవర్లను ఉండమని, ఏళ్లుగా హైర్ బస్ ల్లో డ్రైవర్లు గా పనిచేస్తున్నవారిని వెళ్లిపొమ్మని చెప్పారు. రిక్రూట్మెంట్ కు పిలిచి అర్హులైన తమను రిక్రూట్ చేయకుండా వెళ్లిపొమ్మనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. హైర్​ బస్ ల ఓనర్లు ఆర్ఎం కు ఫోన్  చేయడం వల్లే తమను నియమించలేదని మండిపడ్డారు. ఇదే విషయంపై డ్రైవర్లు ఆర్ఎం కు ఫిర్యాదు చేయగా మార్చి 2న  తిరిగి సెలెక్ట్​ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.