మూడు రోజులుగా కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొత్తపల్లి పట్టణశివారులో వరదనీటిలో కొట్టుకొచ్చిన చేపలను పట్టుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.
భారీగా చేపలు చిక్కుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా చేపల వేట ప్రారంభించారు.
వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్/గంగాధర, వెలుగు