మహబూబ్నగర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా పొగ మంచుతో జనం ఇబ్బంది పడుతున్నారు. నేషనల్ హైవే 44, మహబూబ్నగర్ నుంచి చించోలి, కోయిలకొండ, భూత్పూర్ రోడ్లు దట్టమైన పొగ మంచుతో వాహనదారులకు రోడ్లు కనిపించడం లేదు. ఉదయం 8 గంటలు దాటినా పొగ మంచు వీడడం లేదు. దీంతో పాటు చలి తీవ్రత పెరగడంతో రోజు కూలీలు, వృద్ధులు, పిల్లలు అవస్థ పడుతున్నారు.
_ వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్