- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ సిటీ, వెలుగు: పదేళ్లలో చేయని అభివృద్దిని ఏడాది పాలనలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేసి చూపించానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ నయీంనగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించానన్నారు.
కాళోజి కళాక్షేత్రానికి రూ. 90 కోట్లు నిధులు తెచ్చి పూర్తి చేయించామన్నారు. ఏడాది పాలన డాక్యుమెంటరీని విడుదల చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్దన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి,కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నం
జనగామ, వెలుగు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డి సర్కారుకే దక్కుతుందని జనగామ జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ప్రజాపాలన విజయోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడారు. పదేండ్లలో చేయని అభివృద్ధి ఏడాదిలో చేశామన్నారు. ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఇంచార్జ్ సీహెచ్ శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, డాక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.