
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పెను ప్రమాదం తప్పింది. పూణేలో ఓ వినాయక మండపాన్ని జేపీ నడ్డా సందర్శించిన సమయంలో ఆ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయకుడిని దర్శించుకున్న జేపీ నడ్డా హారతి ఇస్తుండగా మండపం గోపురంపై మంటలు అంటుకున్నాయి. దీంతో జేపీ నడ్డా భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను అక్కడి నుంచి తరలించారు.
పూణేలోని సానే గురూజీ తరుణ్ మిత్ర బృందం ఉజ్జెయినీ మహంకాళీ ఆలయం తరహాలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసింది. ఈ మండపాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సెప్టెంబర్ 26వ తేదీన సందర్శించారు. గణేషుడిని దర్శించుకుని హారతి ఇచ్చారు. అయితే జేపీ నడ్డా వచ్చారన్న ఆనందంతో కొందరు పటాకులు పేల్చారు. ఈ సమయంలో నిప్పు రవ్వలు మండపం గోపురాన్ని తాకాయి. దీంతో వెంటనే గోపురంపై మంటలు చెలరేగాయి.
#WATCH | Pune, Maharashtra: Sane Guruji Tarun Mitra Mandal catches fire.
— ANI (@ANI) September 26, 2023
Details awaited. pic.twitter.com/N27zSpLi7Q
అగ్నిప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.