Pushpa 2: The Rule Effect: దేశం మొత్తంలో పుష్ప ఒక్కటే రిలీజ్ : మిగతా అన్ని సినిమాలు వాయిదా

 Pushpa 2: The Rule Effect: దేశం మొత్తంలో పుష్ప ఒక్కటే రిలీజ్ : మిగతా అన్ని సినిమాలు వాయిదా

 Pushpa 2: The Rule Effect: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కి ప్యాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉండటంతో అన్నిభాషలలో అప్పుడే పుష్ప మేనియా మొదలైంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఏకంగా ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాగా పుష్ప 2: ది రూల్ రికార్డులు క్రియేట్ చేసింది.

పుష్ప 2.. మూవీ దెబ్బ అలా ఇలా లేదు.. ఇండియా సినిమా హిస్టరీలోనే.. ఫస్ట్ టైం.. దేశం మొత్తం ఒకే ఒక్క భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుంది. అదే అల్లు అర్జున్ పుష్ప 2.. ది రూల్. అవును.. ఫస్ట్ టైం ఎలాంటి కాంపిటీషన్ లేకుండా.. ఈ సినిమాకు పోటీ లేకుండా వచ్చేస్తోంది.. పాన్ ఇండియా మూవీ అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత.. ఓ సినిమా రిలీజ్ అవుతున్నా సరే.. తమిళం, మళయాళం. హిందీ, కన్నడ, మరాఠీ ఇలా ఏదో ఒక భాషల్లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.

కానీ మొదటి సారి పుష్ప 2 మూవీ దెబ్బకు.. అన్ని భాషలవాళ్లు సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకున్నారు. ఇందులో ఏకంగా హిందీ మూవీస్ సైతం తమ తమ సినిమాల రిలీజ్ వాయిదా వేసుకున్నారు. పుష్ప 2తో రావాల్సిన హిందీ మూవీ విక్కీ కౌశిల్ చావా మూవీ.. డిసెంబర్ 6 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పుష్ప మూవీ హైప్ చూసిన తర్వాత.. ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో పుష్పకు ఎదురులేకుండా పోయింది. అలాగే మహారాష్ట్రలో ఎక్కువ శాతం థియేటర్లు పుష్ప2 కి కేటాయించారు. 

ఇక తెలుగులో ప్రముఖ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకి కూడా థియేటర్లు సర్దుబాటు కాకపోవడం, సినిమా షూటింగ్ పూర్తికాకపోవడం వంటి కారణాలవల్ల కన్నప్ప సినిమా ఫిబ్రవరి నెలకి వాయిదా పడింది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ తదితరులతోపాటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కామియో అప్పీరియరెన్స్ పాత్రలో నటిస్తున్నాడు.

ALSO READ : Pushpa 2 Making Video: పుష్ప 2 మేకింగ్ వీడియో అరాచకం భయ్యా.. సుక్కు, అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో!

ప్రముఖ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న "గేమ్ ఛేంజర్" కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పుష్ప మాదిరిగానే గేమ్ ఛేంజర్ కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో థియేటర్లు సర్దుబాటున దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దీంతో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

పుష్ప2:  ది రూల్ సినిమా విషయానికొస్తే తెలుగు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందాన నటించగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్, జగపతిబాబు, ధనుంజయ్, అనసూయ, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అలాగే యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించింది.