SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి

SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి

ఐపీఎల్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరుకోగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయింది. నేడు (మే 19) జరగబోయే  మ్యాచ్ పంజాబ్ కు నామమాత్రమే అయినా సన్ రైజర్స్ కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో కమ్మిన్స్ సేన గెలిస్తే టాప్ 2 లోకు దూసుకెళ్తుంది. అదే జరిగితే క్వాలిఫయర్ 1 లో ఓడిపోయినా ఫైనల్ కు వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. 

టాప్ 2 లోకి వెళ్లాలంటే:

ప్రస్తుతం సన్ రైజర్స్ ఖాతాలో 15 పాయింట్స్ ఉన్నాయి. టాప్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (19) ఉంది. కేకేఆర్  క్వాలిఫయర్ 1 ఆడటం ఖాయమైంది. మరోవైపు ఆర్సీబీ 14 పాయింట్లతో ఎలిమినేట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ లేదా సన్ రైజర్స్ జట్లలో ఒక జట్టు కేకేఆర్ తో ప్లే ఆఫ్ ఆడతాయి. ఆదివారం (మే 19) జరిగే రెండు మ్యాచ్ లు ప్లే ఆఫ్ షెడ్యూల్ ను నిర్ణయిస్తాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. 

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే 17 పాయింట్లు ఉంటాయి. ఇక రెండో మ్యాచ్ లో కోల్ కతా తో రాజస్థాన్ రాయల్స్ ఢీ కొడుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే 16 పాయింట్లతో మూడో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు సన్ రైజర్స్ టాప్ 2 లో చోటు దక్కించుకుంటుంది. ఈ రెండు మ్యాచ్ ల ఫలితాలు సన్ రైజర్స్ కు అనుకూలంగా రావాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు. మరి టాప్ 2 లో ఎవరు చోటు దక్కించుకొని కేకేఆర్ తో మ్యాచ్ ఆడతారో నేడు తెలిసిపోతుంది.