పోలింగ్ స్టేషన్లలో కరెంట్ లేకుంటే ఎట్లా.. ఆఫీసర్ల తీరుపై కలెక్టర్ ప్రియాంక ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం/ సుజాతనగర్, వెలుగు: కొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం ప్రాంతంలోని పలు పోలింగ్ స్టేషన్ల బిల్డింగులను, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​ వెజ్​మార్కెట్​పనులు జరుగుతున్న తీరును కలెక్టర్​ప్రియాంక అలా బుధవారం పరిశీలించారు. రామవరంలోని 181, 182, 184, 185, 186, 187 పోలింగ్​స్టేషన్ల బిల్డింగుల్లో కరెంట్ సప్లై లేకపోవడం గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై మండిపడ్డారు. కరెంట్​లేకుండా పోలింగ్​స్టేషన్లు ఎలా ఏర్పాటు చేయాలని ప్రశ్నించారు.

 వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. మన ఊరు- మన బడి నివేదికలకు, క్షేత్ర స్థాయిలో చేసిన పనులకు చాలా తేడాలున్నాయన్నారు. వారం రోజుల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లతో పాటు ఆఫీసర్లను ఆదేశించారు. మార్కెట్​ పనులు నత్తనడకన సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్​నుంచి వివిధ శాఖల ఆఫీసర్లు, రిటర్నింగ్, అసిస్టెంట్​రిటర్నింగ్​ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. పోలింగ్​కేంద్రాల్లోని సౌకర్యాలపై తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు తప్పవని కలెక్టర్​ప్రియాంక హెచ్చరించారు. సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో సుమారు 3.70 లక్షల రొయ్య పిల్లలను జిల్లా కలెక్టర్ ప్రియాంక బుధవారం వదిలారు.