కొడిమ్యాల ఎస్సైపై హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి ఫిర్యాదు

కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల ఎస్సై సందీప్‌‌‌‌‌‌‌‌పై హ్యూమన్‌‌‌‌‌‌‌‌రైట్ కమిషన్‌‌‌‌‌‌‌‌లో రాచకొండ రాజేందర్ అనే యువకుడు గురువారం ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న పోలీసులను తాను గమనించకుండా వెళ్లడంతో వెంబడించి ఇంటి వరకు వచ్చి తనను బూతులు తిడుతూ, లాఠీతో కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఎస్సై సందీప్‌‌‌‌‌‌‌‌, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ రాకేశ్‌‌‌‌‌‌‌‌ తనను తీవ్రంగా గాయపరచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సైపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం ఎస్పీ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.