వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు

వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై  చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి  డిస్ క్వాలిఫై  చేయాలంటూ సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఒక్కో ఓటర్ కు  వెంకట్రామిరెడ్డి రూ. 5వందలు పంపిణి చేశారంటూ రఘునందన్ రావు తన ఫిర్యాదులో తెలిపారు. పోలింగ్ బూత్ ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్ లలో ఒక్కో గ్రామానికి డబ్బుల పంపిణీ చేశారంటూ రఘనందన్ ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.  

20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే చెగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారని..అందులో డబ్బులు దొరికాయన్నారు రఘనందన్.  దీనిపై సిద్దిపేట సీపీ, మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని పోలీసులు అనుకుంటున్నారని మండిపడ్డారు.  ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోయి ఫిర్యాధు చేస్తామని చెప్పారు.  ఎఫ్ఐఆర్  లో వెంకట్రామిరెడ్డి పేరును A5 గా చేర్చారనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలని సూచించారు.