అచ్చంపేట, వెలుగు: రైతుల కు నష్టం కలిగించేలా ప్రాజెక్టుల నిర్మాణాలకు డిజైన్లు చేయడంతో నష్టపోవాల్సి వస్తుందని, నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో నిర్మించే ఉమామహేశ్వర రిజర్వాయర్ ను వెంటనే నిలిపివేయాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బల్మూర్ మండల కేంద్రంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పేదల భూముల లో ప్రాజెక్టు డిజైన్ చేశారని ఆరోపించారు. దీంతో దాదాపు 2200 ఎకరాల భూములను కోల్పోయి రోడ్డున పడనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకొని మినీ రిజర్వాయర్లు నిర్మించాలనన్నారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల కన్వీనర్ సీతారాంరెడ్డి ,బాలస్వామి ,నాగయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.