హైదరాబాద్, వెలుగు: హై-ప్రెసిషన్ అండ్ క్రిటికల్ కాంపోనెంట్స్ తయారు చేసే ఏవియేషన్ కంపెనీ రఘు వంశీ గ్రూప్ తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు గురువారం శంకుస్థాపన చేసింది. దీనికోసం రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ కొత్త సదుపాయంలో 15 ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (ఓఈఎంలు) కోసం ప్రత్యేకమైన మానుఫ్యాక్చరింగ్ బేలు ఉంటాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ మంత్రి డి. శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఈ అత్యాధునిక సదుపాయంతో తమ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తామని రఘు వంశీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ అన్నారు. రాబోయే మూడేళ్లలో 2,000 ఉద్యోగాలను సృష్టించడం ద్వారా తెలంగాణకు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గత ఐదేళ్లలో, కంపెనీ 35 శాతానికి పైగా సమ్మేళనం వార్షిక వృద్ధి రేటును సాధించిందని చెప్పారు.