కేఎంసీలో ర్యాగింగ్ కలకలం​ ?

వరంగల్​ సిటీ, వెలుగు: కాకతీయ మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. నాలుగు రోజుల కింద ఓ స్టూడెంట్​ను ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్​ చేసిన ఘటన వెలుగు చూడగా.. సోమవారం మరో వీడియో బయటకు వచ్చింది. బీఎస్సీ నర్సింగ్​ ఫస్ట్​ ఇయర్ చదువుతున్న విద్యార్థినులను ట్యూటర్స్ ​ఇబ్బంది పెడుతున్నట్టు,  ర్యాగింగ్​కు పాల్పడుతూ స్టూడెంట్స్​తో ఫ్లోర్​ క్లీనింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది. ఎవరికైనా కంప్లైంట్​ చేస్తే మార్కులు కట్​ చేస్తామని బెదిరిస్తుంచినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు వీడియో వైరల్​ అయ్యింది.  ఐదు రోజుల్లోనే రెండు ర్యాగింగ్​ ఘటనలు వెలగు చూడడంతో స్టూడెంట్స్​ భయపడ్తున్నారు. ​ఫ్లోర్​ క్లీన్​ చేస్తున్న విద్యార్థినులను వీడియో తీసిన మరో స్టూడెంట్ తప్పుగా ప్రచారం చేసిందని, ర్యాగింగ్​ లాంటిదేమీ జరగలేదని  కేఎంసీ ప్రిన్సిపల్​ డాక్టర్​ మోహన్​ దాస్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ర్యాగింగ్​కు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.