దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు: రాహుల్

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు:  రాహుల్
  • మోదీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగినయ్: రాహుల్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ  పాలనలో ఆర్థిక వైఫల్యం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మాత్రమే బల్క్​గా ఉత్పత్తి అయ్యాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ దిగజార్చిందని, అన్ని రంగాలను దెబ్బతీసిందని విమర్శించారు. పేదలపై ఇష్టారీతిన పన్నులు వేస్తున్నారని,  వాటన్నింటినీ తగ్గించాలని ఫేస్​బుక్ వేదికగా సోమవారం డిమాండ్ చేశారు. నైపుణ్యం ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, వారికి అన్ని హక్కులు కల్పించాలని కోరారు.