
జమ్మూ: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 3 దశల్లో కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆరోజు రాంబన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా రెండు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తదితరులు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా లో ఉన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 32 సీట్లలో, ఎన్సీ 51 సీట్లలో పోటీ చేస్తున్నాయి.