కర్ణాటక ఎన్నికలు.. ఫుడ్ డెలివరీ బాయ్గా రాహుల్ గాంధీ

 కర్ణాటక ఎన్నికలు.. ఫుడ్ డెలివరీ బాయ్గా రాహుల్ గాంధీ

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మే 10న పోలింగ్ జరగనుండంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. తన ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్ గా మారారు. 

బెంగళూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ...డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ తీసుకొని నడిపారు. ప్రధాని మోడీ రోడ్ షోలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో....బెంగళూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బెంగుళూరు నగరంలో  తాను  ప్రచారం చేయాలనుకున్న ప్రాంతానికి  బైక్పై వెళ్లారు. ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ పై  కూర్చున్న రాహుల్ గాంధీ  హెల్మెట్  ధరించాడు. 
  
మే 08వ తేదీన సోమవారంతో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో అన్ని పార్టీల జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు  28 మంది ఎమ్మెల్యేలున్నారు.  2018 ఎన్నికల్లో  కర్ణాటక ఓటర్లు  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని  ఇవ్వలేదు.