లోక్ సభలో నీట్ రచ్చ... విపక్షాల ఆందోళన

లోక్ సభలో నీట్ అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  విద్యావ్యవస్థను నాశనం చేశారంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. పేపర్ లీకేజీలో రికార్డ్ సృష్టించారంటూ మండిపడ్డాయి  నీట్ పరీక్ష కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవన్నారు  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.  పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అని అన్నారు.  మంత్రి తనను తప్ప అందరినీ తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. 

డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ.  ఈ సమస్యను  మూలాలనుంచి పెకిలించాలని సూచించారు.  దేశంలో పరీక్ష విధానాలపై అనుమానాలు మొదలయ్యాయని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్  భాధ్యతగా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.   నీట్ పరీక్షపై కేంద్రం బాధ్యత వహించాలన్నారు.   ధనవంతులే పేపర్లు కొనుక్కుని డాక్టర్లు అవుతున్నారని మండిపడ్డారు రాహుల్.  

విపక్షాలకు  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు.  నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజీలు సాధారణమన్నారు. పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు.  నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆధారాల్లేవన్నారు. పాట్నాలోని ఒకే ఒక్క  సెంటర్లో  మాల్ ప్రాక్టీసింగ్ జరిగిందని చెప్పారు. నీట్ పరీక్ష వివరాలను  సుప్రీంకోర్టుకు ఇచ్చామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసంతన రాజీనామా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్.