న్యూఢిల్లీ: లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ ను కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఇదేం పద్దతి అంటూ విరుచుకుపడ్డారు. నీట్ వివాధంపై చర్చ జరగాలని ప్రభుత్వం దీనిపై ఓ ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన సందర్బంగా మైక్ కట్ చేశారు.
ప్రధాని మోదీ నీట్ వివాదంపై మాట్లాడకపోగా ..ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ యువత తరపున మాట్లాడుతుంటే.. తీవ్రమైన అంశంపై యువత గొంతు నొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు మైక్ కట్ చేయడం చౌకబారు పనులు చేస్తున్నారని ట్వీట్ ద్వారా కాంగ్రెస్ పోస్ట్ షేర్ చేసింది.
ఉదయం సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని సమర్పించారు. అయితే పార్లమెంట్ లో రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్య వాద తీర్మానంపై సభ చర్చిస్తుందని స్పీకర్ అన్నారు. దీంతో లోక్ సభలో గందరగోళం మొదలైంది. స్పీకర్ సభను వాయిదా జూలై 1కి వాయిదా వేశారు.