ఈ కొండ ఏడు రంగుల్లో ఉంటుంది.. ప్ర‌కృతి వింత‌ల్లోనే అద్భుతం ఇది

ఈ కొండ ఏడు రంగుల్లో ఉంటుంది.. ప్ర‌కృతి వింత‌ల్లోనే అద్భుతం ఇది

చిన్నప్పటి నుంచి ఇంద్రధనస్సు అంటే మనందరికీ క్యూరియాసిటీ.  ఆకాశంలో ఈ ఏడు రంగులు ఎక్కడి నుంచి వస్తాయని అందరి మదిలో ఒకటే ఆలోచన.  ముఖ్యంగా పిల్లలు ఇంద్రధనస్సును చూసి చాలా సంతోషిస్తారు. అయితే వర్షం పడినప్పుడు మాత్రమే ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది.  కానీ మీరు భూమిపైనే ఏడు రంగుల ఇంద్రధనస్సును ఎప్పుడైనా చూశారా..? అవును  భూమిపైనే ఇంద్రధనస్సులోని ఏడు రంగులను మీకు చూపిస్తాం. రండి..

భూమిపై ఇంద్ర ధనస్సు..

భూమిపై ఏడు రంగుల ఇంద్ర ధనస్సు పర్వతం  సౌత్ అమెరికాలోని పెరు దేశంలో ఉంది. ఐదేళ్ల క్రితం మోంటానా డి సియెట్ కాలర్స్ ఇంద్ర ధనస్సు పర్వతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వివిధ రంగుల్లో పర్వతం ఉండటంతో దీనికి రెయిన్బో పర్వతం అని పేరు పెట్టారు. ఈ పర్వతం 17 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సులోని అనేక రంగులు ఈ పర్వతంపై కనిపిస్తాయి. ఇక్కడ ఉండే పర్వత శ్రేణులంతా ఇంద్రధనుస్సులోని ఏడు రంగులను తలపిస్తాయి.  సూర్యకాంతిలో  ఏడు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి.

ALSO READ : అమెజాన్ మేనేజ‌ర్ ను అర్థరాత్రి కాల్చి చంపేశారు..

ఏఏ రంగులు కనిపిస్తాయంటే..

 పెరూలోని రెయిన్బో పర్వతాల మీద పదునైన రంగుల పొర ఉంది.  ఎరుపు, నిమ్మ, ఆకుపచ్చ, మెజెంటా మొదలైన రంగుల పర్వతాలపై కనువిందు చేస్తాయి. ఈ  పర్వతాలను చూస్తే మనసు వికసిస్తుంది. 

ఏ సమయంలో సందర్శించాలి..

పెరూలోని ఈ రెయిన్బో పర్వతాలను చూసి ఆనందించాలనువారు ప్రతీ ఏడాది  జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో వెళ్లాలి. అక్కడి అందాలను, రంగుల పర్వతాలను వీక్షించేందుకు ఇదే  సరైన సమయం. ఈ సమయంలో ఎండలు, వానలు సముపాళ్లలో పడటం వల్ల రంగురంగుల కొండలను చూస్తే ఆ  మజా వేరుగా ఉంటుంది. అయితే శీతాకాలంలో ఈ  పర్వతాలపై మంచు పేరుకుపోతుంది. కాబట్టి రంగురంగుల పర్వతాలు కనిపించవు.