హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. 2023 జూలై 17 మంగళవారం అర్థరాత్రి మొదలైన వాన ఇంకా కురుస్తూనే ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్టా, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, కొండాపూర్, మెహదీపట్నం, నాంపల్లి, కోఠి, ఛాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో వానపడుతున్నది.
దీంతో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. రోడ్లపై వెళ్లే వాహనదారులంతా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ALSO READ :డెంటల్ కాలేజీల ఏర్పాటుపై .. పట్టింపేది?
మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రోజున ఉమ్మడి అదిలాబాద్ , కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లు్ండి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.