![ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలి](https://static.v6velugu.com/uploads/2025/02/rajannasiricilla-collector-emphasizes-quality-education-in-government-schools_wXWoidTtLq.jpg)
- రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తంగళ్లపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందుతుందని, పిల్లలను సర్కార్ బడుల్లో చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధి తెనుగువారిపల్లె లోని ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. స్కూల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం తయారీని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్‌లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని, స్ట్రెంత్ పెంచేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. అంతకుముందు తంగళ్లపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్‌సీలో ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. హాస్పిటల్‌లోని ఓపీ, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్, చంద్రికారెడ్డి, హెచ్‌ఎం కార్తిలాల్, సిబ్బంది ఉన్నారు. పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేశ్, లలిత కూతురు బుధవారం టీకా వికటించి చనిపోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి బుధవారం రాత్రి రూ.లక్ష చెక్కు అందజేయగా.. గురువారం మరో రూ.లక్ష చెక్కును కలెక్టరేట్‌లో అందజేశారు.