
కుభీర్, వెలుగు: మహాశివరాత్రి పండుగనాడు కుభీర్మండలంలోని పార్డి(బి) గ్రామంలో ప్రారంభమైన రాజరాజేశ్వర జాతర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్రలోని పలు గ్రామాల నుంచి మల్ల యోధులు భారీగా తరలివచ్చారు.
మహారాష్ట్రకు చెందిన పల్లవి, దేవి అనే మహిళల కుస్తీ పోటీలు అలరించాయి. ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. గెలుపొందిన మల్లయోధులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. కమిటీ సభ్యులు జాతరలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.