ఐపీఎల్ లో మరో భారీ స్కోర్ నమోదయింది. లక్నో సూపర్ జయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో సత్తా చాటింది. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ అదరగొట్టడంతో లక్నో ముందు ఛాలెంజింగ్ టార్గెట్ విసిరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ 52 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆదుకున్న శాంసన్, పరాగ్
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కు మంచి ఆరంభం లభించలేదు. 2 ఫోర్లు కొట్టి మంచి టచ్ మీద కనిపించిన బట్లర్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన జైస్వాల్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 24 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో 49 పరుగులకే 2 ఓపెనర్లను కోల్పోయిన రాజస్థాన్ ను కెప్టెన్ శాంసన్,రియాన్ పరాగ్ ఆదుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు 93 పరుగులు జోడించడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. చివర్లో శాంసన్ తో పాటు జురెల్ బ్యాట్ ఝళిపించడంతో 193 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, మోషీన్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
HATS OFF TO SANJU SAMSON - 82* (52)🔥🩷#IPL #IPL2024 #IPLonJioCinema #TATAIPL2024 #RRvsLSG #RRvLSG #Naveen #Jaiswal #SanjuSamson #LSG #RR #JioCinema #LSG #RR #RiyanParag #Sanju pic.twitter.com/5UH9x0rQ0t
— Indian Cricket FanClub (@IN_Cricks) March 24, 2024