Rajinikanth:ఫ్లైట్ని థియేటర్‌గా మార్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. వీడియో వైరల్!

Rajinikanth:ఫ్లైట్ని థియేటర్‌గా మార్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్.. అది సినిమాల్లో. బయట ఉంటే కామన్ మ్యాన్ శివాజీరావు గైక్వాడ్. కేవలం సినిమా షూటింగ్ ల్లో ఉన్నప్పుడు మాత్రం రజినీ స్టయిలిష్ మేకోవర్ లో ఉంటాడు. ఒక్కసారి సెట్ దాటాడా.. ఇక అతి సామాన్యమైన శైలిలో ఉంటాడు.

తన జీవితం గురించి..తను జీవితం ఎలా మొదలైంది అనేది చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రజినీకాంత్ (Rajinikanth) మాత్రమే. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపే రజినీ లాంటి వ్యక్తులు వేలలో ఒకరుంటారేమో అనిపిస్తోంది. కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. 

లేటెస్ట్గా రజినీకాంత్ తన ఎంట్రీతో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు.రజనీకాంత్ ఇటీవల ఇండిగో విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. నటుడిని గమనించిన వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికులు హర్షధ్వానాలు చేస్తూ హోరెత్తించారు. ఆ వెంటనే ప్రయాణికులు తమ ఫోన్‌లను తీసి రజినీ ఎంట్రీని రికార్డ్ చేశారు. అలాగే,  చేయి ఊపుతూ 'తలైవా' అంటూ నినాదాలతో రజినీని ఆకర్షించారు.

ఇక రజనీకాంత్ తన అభిమానులను చూసి చిరునవ్వుతో అభివాదం చేస్తూ కూర్చొన్నారు. అయితే, "జైలర్ 2" షూటింగ్ ముగించుకుని రజనీకాంత్ తిరిగి విమాన ప్రయాణంలో బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

►ALSO READ | Sarangapani Jathakam: సారంగపాణి జాతకం ఫస్ట్ డే వసూళ్లు ఇంత తక్కువా.. అసలు సినిమా కథేంటీ?

భారీ ఆదరణతో విమానాన్ని థియేటర్‌గా మార్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియోను Xలో షేర్ చేస్తున్నారు. ఆయనని చూడటానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసే వారి కల.. ఇలా ఒక ప్రయాణంలో సడెన్గా వస్తుందని ఏ మాత్రం ఉహించలేదంటున్నారు.

గతేడాది మార్చిలో, ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుండి విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తూ రజినీ కనిపించారు. ఆయన ముఖం దాచుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. టేకాఫ్ కోసం తన సీటులో కూర్చోవడానికి ముందు అతను సిబ్బందితో కూడా మాట్లాడాడు.అలాంటి సింప్లిసిటీ వ్యక్తి ఉన్న స్టార్ హీరోగా ఉండటం మన లక్కీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రజినీకాంత్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాతో పాటుగా జైలర్ 2 లోను నటిస్తున్నాడు. కూలీ మూవీ షూటింగ్ ముగించుకుని రిలీజ్కు సిద్ధం కాబోతుంది.

జైలర్ 2 మాత్రంవరుస షూటింగ్స్తో బిజీగా ఉంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చెన్నైలో జరిగగా, సెకండ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్ గా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసింది.