న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రెండో రోజు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో అదానీపై అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభలో అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం భారతదేశ సమగ్రతను అదానీతో ఉన్న స్నేహభంధంపై మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో వైపు కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు.. శాంతిభద్రతలపై చర్చించడానికి లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
ALSO READ : అదానీ ఇష్యూపై చర్చ జరగాల్సిందే.. లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాం
ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించిడంతో ప్రతిపక్షలు ఆందోళన దిగాయి. అదానీ, మణిపూర్ అంశంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం పరిస్థితులు నెలకొనడంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్య సభలోనూ సేమ్ ఇదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ పెద్దల సభను రేపటికి (గురువారం) వాయిదా వేశారు.