మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్

మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు.. ఇవాళ చివరి విడుత పోలింగ్ జరుగుతుండగానే..  మరో ఎన్నికల సమరానికి తెరలేపింది. వచ్చే ఏప్రిల్ నెలలో ఖాళీ కానున్న 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది భారత ఎన్నికల కమిషన్. వచ్చే నెలలో ఖాళీ కానున్న ఆరు రాష్ట్రాల పరిధిలోని 13 రాజ్యసభ స్థానాలకు ఈనెల 31న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పంజాబ్ లో ఐదు, కేరళలో మూడు, అసోంలో రెండు, రెండు, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

పదవీ విరమణ చేయనున్న సభ్యులు 

పంజాబ్: ప్రతాప్ సింగ్ బజ్వా, సుఖ్ దేవ్ సింగ్, నరేష్ గుజ్రాల్, శంషేర్ సింగ్ దుల్లో, శ్రైత్ మాలిక్
అసోం: రాణీ నరాహ్, రిపున్ బోరా
నాగాలాండ్: కె.జి.కెన్యే
త్రిపుర: జర్నాదాస్
హిమాచల్ ప్రదేశ్: ఆనంద్ శర్మ

ఎన్నికల షెడ్యూల్ 

నోటిఫికేషన్ జారీ: మార్చి 14, 2022.
నామినేషన్ల దాఖలుకు చివరి తేది: మార్చి 21, 2022.
నామినేషన్ల పరిశీలన: మార్చి 22, 2022.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 24, 2022.
పోలింగ్: మార్చి 31, 2022 ( ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు)
ఓట్ల లెక్కింపు: మార్చి 31, 2022 (సాయంత్రం 5 గంటలకు).

 

ఇవి కూడా చదవండి

ఢిల్లీకి ఒక న్యాయం...రాష్ట్రానికి ఒక న్యాయమా ?

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్