రైల్వే బోర్డు చైర్మన్​ను కలిసిన ఎంపీ వద్దిరాజు

రైల్వే బోర్డు చైర్మన్​ను కలిసిన ఎంపీ వద్దిరాజు

న్యూ ఢిల్లీ, వెలుగు: రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సమావేశమయ్యారు. సోమవారం ఢిల్లీలోని రైల్ భవన్ లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. 

పలు రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్త ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ల ఏర్పాటు, పాత వాటి విస్తరణ, కరోనాకు ముందు రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించడం, అదనపు హాల్టింగులు, మరిన్ని రైల్వే సర్వీసులను ప్రారంభించడం తదితర అంశాలను వినతి పత్రంలో పేర్కొన్నారు. తన విజ్ఞప్తులపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని వద్దిరాజు వెల్లడించారు.