రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు

రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో  టైమింగ్స్ మార్పు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్రిల్ 8 దాకా సమావేశాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మొదటి విడత సమావేశాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగాయి. టైమింగ్స్‌‌ మార్పుతో 19 గంటలు ఎక్కువగా సమావేశాలు జరగనున్నాయి. సమావేశ సమయాల పెరుగుదలతో ప్రజాసమస్యలపై చర్చలకు, సభా వ్యవహారాల నిర్వహణ కోసం 64 గంటల 30 నిమిషాల పాటు రాజ్యసభలో రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాలు కొనసాగుతాయని రాజ్యసభ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం ప్రారంభం కాబోయే సభ విరామ సమయంలో డీఆర్‌‌‌‌ఎస్సీ (డిపార్ట్‌‌మెంట్ రిలేటెడ్‌‌ స్టాండింగ్ కమిటీ)ల పనితీరును చైర్మన్‌‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వివరించే అవకాశం ఉంది.