
నేరడిగొండ , వెలుగు: రాఖీ పండుగకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ చనిపోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం కనుగుట్టకు చెందిన నల్ల లింగన్న నిర్మల్లో ఉంటున్నాడు.
రాఖీ పండుగ సందర్భంగా సొంతూరులో ఉంటున్న చెల్లె దగ్గరకు భార్య నర్సవ్వ, తమ్ముడు కల్యాణ్ తో కలిసి వెళ్లాడు. చెల్లెతో రాఖీ కట్టించుకుని ఆ తర్వాత ముగ్గురు బైక్ పై నిర్మల్ వెళ్తుండగా.. నేరడిగొండ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న కారును బైక్ ఢీ కొట్టింది. దీంతో నర్సవ్వ తలకు తీవ్ర గాయమై స్పాట్లోనే చనిపోయింది. అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని నిర్మల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.