దసరా కానుకగా .. అక్టోబర్ 11న విడుదల అవుతున్న జిగ్రా మూవీ

దసరా కానుకగా .. అక్టోబర్ 11న విడుదల అవుతున్న జిగ్రా మూవీ

అలియా భ‌‌‌‌‌‌‌‌ట్, వేదాంగ్ రైనా లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్,  అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఏషియ‌‌‌‌‌‌‌‌న్ సురేష్ ఎంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన హిందీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం ఈ మూవీ తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రామ్ చరణ్ విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘ఈ కథలో మంచి సోల్ ఉంది.  భాష‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా ఎవ‌‌‌‌‌‌‌‌రికైనా ఇది క‌‌‌‌‌‌‌‌నెక్ట్ అవుతుంది. ఇలాంటి వైవిధ్యమైన క‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల‌‌‌‌‌‌‌‌కు అందించాల‌‌‌‌‌‌‌‌ని భావించాం.

అందుకే ధ‌‌‌‌‌‌‌‌ర్మ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌తో క‌‌‌‌‌‌‌‌లిసి నేను, ఏషియ‌‌‌‌‌‌‌‌న్ సురేష్ ఎంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుద‌‌‌‌‌‌‌‌ల చేస్తున్నామ‌‌‌‌‌‌‌‌ని గ‌‌‌‌‌‌‌‌ర్వంగా తెలియ‌‌‌‌‌‌‌‌జేస్తున్నాం. ఇది కేవ‌‌‌‌‌‌‌‌లం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు..  కుటుంబంలోని అనుబంధాల‌‌‌‌‌‌‌‌ను తెలియ‌‌‌‌‌‌‌‌జేసే చిత్రం. మ‌‌‌‌‌‌‌‌నం ఎంతగానో ప్రేమించే వ్యక్తుల‌‌‌‌‌‌‌‌ను మనం ఎలా కాపాడుకోవాలో తెలియ‌‌‌‌‌‌‌‌జేసే సినిమా’ అని అన్నాడు.