- మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : దేశంలో అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కొప్పుల వేణారెడ్డి సమక్షంలో పిల్లలమర్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులతోపాటు100 మంది కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, నాయకులు చింత వెంకన్న, సంద సైదులు, కోట్ల సైదులు, కోట్ల నవీన్, చంద్రశేఖర్, జెర్రిపోతుల నరేందర్, సాడక్, చేరుకుపల్లి బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.