రామగుండం బల్దియాలో అందని 24 గంటల వాటర్​

  • నీటి వృథాను అరికట్టేందుకు తెరపైకి 24 గంటల సప్లై ప్రతిపాదన 
  • ప్రతిపాదనల వరకే ఆగిన స్కీము 
  • బల్దియాలోని 50 డివిజన్లలో 42 వేల నల్లా కనెక్షన్లు 
  • ప్రతి నల్లాకు మీటర్ల బిగింపు పూర్తి

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​పరిధిలో తాగునీటి వృథాను అరికట్టేందుకు 24 గంటల పాటు వాటర్​ సప్లై చేయాలనే నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. మిషన్​భగీరథ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా పబ్లిక్​ హెల్త్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆధ్వర్యంలో ఎల్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ సంస్థ ఇంటింటికి నల్లాలు బిగించి, మీటర్లు ఏర్పాటు చేసింది. అయితే నేటికీ నిరంతర నీటిసరఫరా అమలుకు నోచుకోలేదు. దీంతో ఈ స్కీమ్​కోసం ఖర్చు చేసిన ప్రజాధనం వృథాగా మారినట్టయింది. 

నీటి వృథా అరికట్టేందుకు...

రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 50 డివిజన్లలో సుమారుగా 42 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ నుంచి 40 మిలియన్​ లీటర్స్​ఫర్​డే(ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ) వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కార్పొరేషన్​ పరిధిలో ఉన్న 13 ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సప్లై చేసి అక్కడి నుంచి నివాసాలకు ఇంటర్నల్​ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. కాగా కార్పొరేషన్​ ద్వారా సప్లై చేస్తున్న నీటిలో 20 శాతం నుంచి 30 శాతం వృథాగా పోతున్నది. నల్లా నీరు వచ్చే సమయంలో అంతకుముందు రోజు పట్టుకున్న నీటిని పారబోస్తుండడంతో ఈ వృథా జరుగుతోంది. దీనిని అరికట్టేందుకు 24 గంటల పాటు నీటి సరఫరా చేస్తూ మీటర్లు బిగించడానికి నిర్ణయించారు. 

2019లో గవర్నమెంట్​ పబ్లిక్​హెల్త్​ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఇంటింటికి నల్లా కనెక్షన్​ఇచ్చారు. దీనిలో భాగంగా రూ.88కోట్లతో 3 వాటర్​ట్యాంకులు, ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లు, ఇంటింటికి నల్లాలు బిగించడం.. కాంట్రాక్టును ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీకి అప్పగించారు. ఇప్పటికే ట్యాంకులు, ఇంటర్నల్​పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లతోపాటు ఇంటింటికి నల్లాలు వేసి మీటర్లను బిగించారు. 24 గంటల పాటు నీటిని సప్లై చేసి, వాడుకున్న నీటికే బిల్లులు వేసేలా చర్యలు చేపట్టారు. కాగా ట్యాంకులు వినియోగంలోకి రాగా.. ఇంటింటికి 24గంటల నీటి సప్లై మాత్రం అమలుకాలేదు. 

ముందుకు సాగని స్కీమ్​

కార్పొరేషన్​ పరిధిలో ఇంటింటికి బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి మీటర్లను బిగించినప్పటికీ వాటికి తాగునీటి పైపులైన్లను అనుసంధానం చేయలేదు. దీంతో మీటర్లు తుప్పుపట్టి పనికిరాకుండా పోతున్నాయి. అలాగే అన్నపూర్ణకాలనీలో ఇంటర్నల్​ పైపులైన్లు వేయకపోవడంతో అక్కడ సుమారు 200 కుటుంబాలకు ఇప్పటికీ తాగునీటి సరఫరా జరగడం లేదు. 

ఎన్టీపీసీ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్​కింద బోర్లు వేయడంతో వాటి ద్వారా ప్రజలు నీటిని వాడుకుంటున్నారు. ఇప్పటికైనా రామగుండం బల్దియాలో 24 గంటల వాటర్​ సప్లై చేసేందుకు బిగించిన వాటర్​ మీటర్లను అందుబాటులోకి తీసుకురావాలని, పలు ప్రాంతాలలో నిలిచిపోయిన ఇంటర్నల్​ పైపులైన్లను ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.