![పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం కీలకం: సీపీ ఎం.శ్రీనివాస్](https://static.v6velugu.com/uploads/2025/02/ramagundam-cp-m-srinivas-inaugurates-renovated-armed-reserve-facilities_CD2HM5EZLs.jpg)
- రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్
గోదావరిఖని, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతోపాటు ఏఆర్ విభాగం కూడా కీలకమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్ఆవరణలోని హెడ్ క్వార్టర్స్‌లో పునరుద్ధరించిన ఆర్మ్డ్రిజర్వ్ ఆఫీసులు, సిబ్బంది బ్యారక్, వెహికల్స్సర్వీసింగ్ పాయింట్, పరేడ్ గ్రౌండ్‌లో సెల్యూట్బేస్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో, పండుగలు, ఎన్నికలు సమయాల్లో బందోబస్తు.. వంటి విధుల నిర్వహణలో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీపీలు చేతన, ఎ.భాస్కర్, అడిషనల్ డీసీపీ సి.రాజు, ఏసీపీలు రాఘవేంద్రరావు, ఎం.రమేశ్, నరసింహులు, ప్రతాప్ పాల్గొన్నారు.