- రామగుండం సీపీ శ్రీనివాస్
గోదావరిఖని, వెలుగు: పోలీసుల పనితీరు, వారు అందించే సేవలపై ప్రజలు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ సూచించారు. గురువారం కమిషనరేట్ ఆఫీస్‌లో ఫీడ్ బ్యాక్ తెలిపేందుకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న పోస్టర్లను సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదుదారులు, బాధితులకు సంబంధించి సిబ్బంది తీరు, ప్రవర్తన, స్పందన గురించి క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని సూచించారు.
కాగా ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రజలకు కనిపించేలా క్యూఆర్ కోడ్‌తో ఉన్న పోస్టర్లను ఏర్పాటు చేయాలని పోలీసు ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏసీపీలు, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.