బండలవాగు ప్రాజెక్ట్‌‌‌‌ను​ త్వరలో ప్రారంభిస్తాం : రాజ్‌‌‌‌ఠాకూర్​

  • రామగుండం ఎమ్మెల్యే రాజ్‌‌‌‌ఠాకూర్​ 

గోదావరిఖని, వెలుగు: పాలకుర్తి మండలంలోని బండలవాగు ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో బుధవారం ఎడ్ల బండ్ల ర్యాలీ, ముగ్గుల పోటీ, పతంగుల పోటీలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండలవాగు ప్రాజెక్ట్ కింద 15 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.

 పాలకుర్తి మండలంలో రైతులకు నిత్యం సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్​ను నిర్మించామన్నారు. గోదావరిఖని కల్చరల్​ క్లబ్​ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా పీజీ కాలేజీ గ్రౌండ్​లో కైట్​ ఫెస్టివల్​ నిర్వహించగా ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ హాజరై పతంగులు ఎగురవేశారు. వేర్వేరు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్, లీడర్లు మహాంకాళి స్వామి, దీటి బాలరాజు పాల్గొన్నారు.

జర్నలిస్ట్​ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

ఇటీవల గుండెపోటుతో చనిపోయిన గోదావరిఖనికి చెందిన టీవీ జర్నలిస్ట్​ సిరిశెట్టి చిరంజీవి కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారు.  మంగళవారం రాత్రి గోదావరిఖని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లోని వారి నివాసానికి వెళ్లి జర్నలిస్ట్‌‌‌‌ భార్య రాజసులోచనకు నగదును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్​ క్లబ్​ అధ్యక్షుడు పూదరి కుమార్, ఎలక్ట్రానిక్​ మీడియా ప్రెసిడెంట్​బైరం సతీశ్‌‌‌‌, ప్రెస్‌‌‌‌క్లబ్ ప్రతినిధులు సత్యనారాయణ, రాజ్​కుమార్, శంకర్​, శ్రీనివాస్, రమేశ్‌‌‌‌, వరుణ్, హకీమ్​, పాల్గొన్నారు.