టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి ఈసారి సరికొత్తగా " ది రానా దగ్గుబాటి టాక్ షో" అనే టాక్ షో తో ఆడియన్స్ ని అలరించడానికి ముందుకు వస్తున్నాడు. అయితే ఈ టాక్ షో నవంబర్ 23 నుంచి ప్రముఖ ఓటిటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రసారం కానుంది. ఈ టాక్ షోని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈరోజు ప్రైమ్ వీడియోస్ అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.
అయితే ఈ షోలో సినీ సెలబ్రెటీలతో రానా దగ్గుబాటి సందడి చేయనున్నాడు. ఇందులోభాగంగా ఈ టాక్ షోలో కొంతమేర డిఫరెంట్ కాన్వర్సేషన్స్, న్యూ హాబీస్ వంటివాటి గురించి మాట్లాడుతూ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ సినీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ టాక్ షో మొదటి సీజన్ లో 8 ఎపిసోడ్లు ఉండగా దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, SS రాజమౌళి మరియు రామ్ గోపాల్ వర్మ తదితరులు పాల్గొని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి శనివారం ప్రైమ్ వీడియోలో ఒక ఎపిసోడ్ ని రిలీజ్ కానుంది.
ALSO READ | Kanguva Advance Bookings: రిలీజ్ కి ముందే ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే.?
ఈ విషయం ఇలా ఉండగా టాక్ షోలు హోస్ట్ చెయ్యడం రానా కి కొత్తేమికాదు. గతంలో నంబర్ 1 యారీ ని హోస్ట్ చేసి పలువురు సెలెబ్రెటీలతో సందడి చేసి అలరించాడు. దీంతో ఈసారి సరికొత్తగా రానా దగ్గుబాటి టాక్ షోతో ముందుకు వస్తున్నాడు.
అయితే ఇదే తరహాలో టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబువుల్ షో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అన్ స్టాపబువుల్ షో ప్రముఖ ఓటిటి ఆహాలో ప్రసారమవుతోంది. అయితే అన్ స్టాపబువుల్ షో వరల్డ్ లోనే అత్యంత పాపులర్ టాక్ షోస్ లో 18వ స్థానంలో నిలిచింది. మరి రానా దగ్గుబాటి కూడా బాలకృష్ణ మాదిరిగానే ఆడియన్స్ ని అలరిస్తాడో లేదో చూడాలి.