అందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ కృష్ణ అండ్ హిస్ లీల

అందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ కృష్ణ అండ్ హిస్ లీల

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిస్ లీల’. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్స్.  ఐదేళ్ల క్రితం కొవిడ్ కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని  ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌‌’ పేరుతో ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేస్తున్నారు.  శుక్రవారం సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘ఈ సినిమాను థియేటర్స్‌‌లో అందరితో కలసి చూడడం అనేది వెరీ గుడ్ ఫీలింగ్.

 థియేటర్స్‌‌లో ఫస్ట్ టైమ్ విడుదల చేస్తున్నాం కనుక ఇది రీరిలీజ్ కాదు. నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్ధమవుతాయి. అందులో ఈ సినిమా ఒకటి. అందరి లైఫ్‌లో కొన్ని జరుగుతాయి. వాటిని చాలా అందంగా క్యాప్చర్ చేశారు’ అని చెప్పాడు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు తీయడానికి కొందరు ధైర్యం చేయరు.  కానీ రానా మాత్రం ఇలాంటి కథలే చెప్పాలి అనుకుంటాడు. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌‌లో చూడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. రానాకు చెబితే ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి పర్ఫెక్ట్‌‌ డేట్‌‌గా భావించాడు.  థియేటర్స్‌‌లో ప్రేక్షకుల ఎక్సయిట్మెంట్‌‌ చూడాలని ఉంది’ అన్నాడు.  దర్శకుడు రవికాంత్ పేరెపు మాట్లాడుతూ ‘ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది కనుక జనంతో కలిసి చూస్తే మజా వస్తుంది. కానీ లాక్ డౌన్‌‌ వల్ల థియేటర్స్‌‌లో చూడటం కుదరలేదు. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం’ అని చెప్పాడు.