ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కాసుల వర్షం

ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కాసుల వర్షం
  • రంగారెడ్డి జిల్లా ఆర్టీఏకు ఒక్కరోజే రూ.37 లక్షల ఆదాయం
  • టీజీ 07 పీ 9999 విలువ రూ.9 లక్షల 87 వేలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీసులో శనివారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కాసుల వర్షం కురిసింది. ఒక్కరోజే రూ.37లక్షల29వేల690 ఆదాయం వచ్చింది. టీజీ 07 పీ 9999 నంబర్​ను ముప్ప ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వేలంలో అత్యధికంగా రూ.9 లక్షల 86 వేల 999కు సొంతం చేసుకుంది. 

అలాగే టీజీ 07 ఆర్ 0009 నంబర్​ను కేఎల్ఎస్ఆర్ ఇన్​ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ రూ.7.50 లక్షలకు దక్కించుకుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మొత్తం 106 మంది ఆయా ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలంలో పాల్గొన్నారన్నారు. వేలం ద్వారా రూ.37లక్షల29వేల690 వచ్చినట్టు వెల్లడించారు.