
ఎల్బీనగర్,వెలుగు: ప్రతిశాఖలో ఈ – ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ సూచించారు. కలెక్టరేట్ లో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, ఫైళ్లు పెండింగ్ లేకుండా తర్వగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి శాఖలో ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.