48వ సారి రంజీ ఫైనల్లో ముంబై

48వ సారి రంజీ ఫైనల్లో ముంబై
  •  సెమీస్‌‌‌‌‌‌‌‌లో తమిళనాడు చిత్తు


ముంబై: శార్దూల్ ఠాకూర్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో ముంబై రంజీ ట్రోఫీలో 48వ సారి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. సోమవారం ముగిసిన సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 70 రన్స్ తేడాతో తమిళనాడును చిత్తు చేసింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 353/9తో మూడో రోజు ఆట కొనసాగించిన ముంబై తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో  378 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో జట్టుకు 232 రన్స్ ఆధిక్యం లభించింది. తనుష్ (89 నాటౌట్‌‌‌‌‌‌‌‌) అజేయంగా నిలిచాడు. అనంతరం భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆరంభించిన తమిళనాడు 51.5 ఓవర్లలో 162 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.

 బాబా ఇంద్రజీత్ (70) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు.  రెండో రోజు అద్భుత సెంచరీతో ముంబైని ఆదుకున్న శార్దూల్ ఆరంభంలోనే తమిళనాడు ఓపెనర్లు జగదీశన్ (0), సాయి సుదర్శన్ (5)ను ఔట్ చేసి ముంబై విజయానికి బాటలు వేశాడు. శామ్స్ ములానీ నాలుగు, మోహిత్‌‌‌‌‌‌‌‌ అవస్తి, తనుష్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో తమిళనాడు కుప్పకూలింది. శార్దూల్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.