Wimbledon 2024: మహిళా ఛాంపియన్‌ను కలిసిన రవిశాస్త్రి.. ఎవరీ మిస్టరీ గర్ల్?

Wimbledon 2024: మహిళా ఛాంపియన్‌ను కలిసిన రవిశాస్త్రి.. ఎవరీ మిస్టరీ గర్ల్?

టీమిండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో తన కామెంటరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం రవిశాస్త్రి ఇంగ్లాండ్ లో ఉన్నాడు. వింబుల్డన్ 2024 జరుగుతుండడంతో మ్యాచ్ లను చుడాడనికి శాస్త్రి అక్కడికి వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ శాస్త్రి.. మహిళల టెన్నిస్ మాజీ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవాను కలుసుకున్నాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. క్రికెట్ అభిమానులు ఈమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ALSO READ | కోహ్లీ రెస్టారెంట్ లో అసలు ఏం జరిగింది.. పోలీసుల రైడ్ ఎందుకు..?

టెన్నిస్ గ్రేట్‌ను కలుసుకున్నందుకు శాస్త్రి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.  ఆమెను ఫ్యాషన్ ఐకాన్ అని పిలిచాడు. షరపోవాను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని.. టెన్నిస్ లో ఆమె చాలా అద్భుతాలు చేసిందని ఈ మాజీ కోచ్ చెప్పుకొచ్చారు. ఈ పర్యటనలో రవిశాస్త్రి తన లెజెండరీ టెన్నిస్ ఐకాన్ రాడ్ లావర్‌ను కూడా  కలిశాడు. అతను ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టెన్నిస్ ప్లేయర్ అని ఒక కితాబులిచ్చాడు. 

ఎవరీ షరపోవా 

మరియా షరపోవా ఒక రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె టెన్నిస్ ఆడటం మానేసి చాలా ఏళ్లయింది.. కానీ ఆమె పట్ల ప్రపంచానికి ఉన్న అభిమానం మాత్రం తరగనిది. ఆటలోనూ, అందంలోనూ ఈమెకు భారీ ఫాలోయింగ్ ఉండేది. 2004 లో టెన్నిస్ అరంగేట్రం చేసిన ఈమె మొత్తం 5 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచింది.  రెండు ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్స్ గెలిచిన ఆమె ఒక  ఆస్ట్రేలియన్ ఓపెన్ , వింబుల్డన్, US ఓపెన్‌ లను నెగ్గింది. షరపోవా 18 సంవత్సరాల వయస్సులో 2005లో తొలి సారి వాల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ గా నిలిచింది. 

మరిన్ని వార్తలు