భారత వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో బుధవారం( డిసెంబర్ 18) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ సిరీస్ లో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టాడు. అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్ లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ALSO READ : IND vs AUS 3rd Test: ఫలించని ఆస్ట్రేలియా ప్రయోగం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్ట్
భారత్ తరపున అశ్విన్ 14 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్ కు ఘనంగా గుడ్ బై చెప్పాడు. 38 ఏళ్ళ అశ్విన్ టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ముత్తయ్య మురళీధరన్ (67) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. భారత టెస్ట్ క్రికెట్ లో అనీల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2010 లో శ్రీలంకపై వన్డే మ్యాచ్ ద్వారా అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2011 వన్డే వరల్డ్ కప్ 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అశ్విన్ సభ్యుడు.
ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో అశ్విన్ ఆడతాడు. అతను 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.
🚨 JUST IN: Ravichandran Ashwin retires from all forms of international cricket #AUSvIND pic.twitter.com/QH09se7V81
— ESPNcricinfo (@ESPNcricinfo) December 18, 2024