టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అదరగొడుతుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి సూపర్ 8 బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై వరుసగా నెగ్గిన రోహిత్ సేన.. మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 15 న కెనడాతో ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా టీమిండియా ఆల్ రౌండర్లు జడేజా, హార్దిక్ పాండ్య ఒక ప్రోగ్రామ్ లో యువ అభిమానులతో సందడి చేశారు.
స్టార్ స్పోర్ట్స్ తో ముచ్చటించిన మన క్రికెటర్లు కాసేపు సరదాగా గడిపారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా టీమిండియాలో తనకెవరంటే భయమో చెప్పుకొచ్చాడు. ఒక చిన్నపిలాడు.. “నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు ఎవరికీ భయపడలేదా?” అని జడేజాను అడిగాడు. దీనికి జడేజా నవ్వుతూ “నేను ధోనీ భాయ్ చాలా భయపడతాను అని చెప్పుకొచ్చాడు. ధోనీ, జడేజాల మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దానికి పైగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం జడేజా టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఒక్క వికెట్ తీయలేదు. మరోవైపు బ్యాటింగ్ లోనూ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక వరల్డ్ లోనే బెస్ట్ ఫీల్డర్ గా గుర్తింపు ఉన్న ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఇప్పటివరకు ఒక్క క్యాచ్ అందుకోలేదు. మరి రానున్న మ్యాచ్ ల్లో జడేజా ఎలాంటి ప్రదర్శనను నమోదు చేస్తాడో చూడాలి.