
అమ్రాబాద్, వెలుగు: రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు, కోలాటం, ధూంధాం ప్రోగ్రాంలను ఏర్పాటు చేశారు.
వివిధ గ్రామాల నుంచి భాజాభజంత్రీలు, డప్పు, సన్నాయి వాయిద్యాలతో ప్రభలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. సత్యహరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం వంటి పౌరాణిక నాటకాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దంపతులు చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ, ఆలయ కమిటీ చైర్మన్ నరహరి, ఆనంద్, చెన్నకేశవులు పాల్గొన్నారు.